తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక ఆదివారం శ్రీవారిని 81,744 మంది భక్తులు దర్శించుకోగా, 36,833 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు వచ్చింది.