హైదరాబాద్ ప్రజలు రోజుకు 2,610 మిలియన్ లీటర్ల నీటిని అందుకుంటున్నారని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు వెల్లడించింది. దాదాపు 13 మిలియన్‌ల కుటుంబాలకు నీటిని అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే బెంగళూరు 12.9 మిలియన్ల జనాభాకు 1,460 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే అందుకుంటుందని అన్నారు. హైదరాబాద్‌లో సరఫరా, లభ్యత బెంగళూరు కంటే ఎక్కువగా ఉందని బోర్డు తేల్చి చెప్పింది.