గణపతిని ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఇంకో సులభమైన ఉపాయముంది. అది ఏమిటంటే పసుపుతో చక్కగా చిన్న గణపతిని తయారు చేసుకోవచ్చు. గణపతి ఆకారం తయారు చేసుకున్న తర్వాత చిన్న మిరియాలు గాని, ఆవాలు గాని వాడి కళ్లను తయారు చేసుకోవచ్చు. ఇలా సృజనాత్మకతతో ఆలోచిస్తే ఎన్నో ఉపాయాలున్నాయి. ఇలా తయారు చేసుకున్న వినాయకుని నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, నదులు కలుషితం కావు. పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్లవుతుంది.