ఆసుపత్రిలో చేరిన డీఎస్

546చూసినవారు
ఆసుపత్రిలో చేరిన డీఎస్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి. శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా ఇంటికే పరిమితమైన డీఎస్. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా మూత్రనాళంలో ఇన్ఫెక్షన్తో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని డీఎస్ కుమారుడు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బుధవారం వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్