గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని జాంబాగ్‌లో మంగళవారం బస్తీ దవాఖానను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రారంభించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 153 బస్తీ దావకణాలు ఉండగా, ఇప్పుడు కొత్తగా మరో 14 దవాఖానాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు.