జవహర్ నగర్ కి చెందిన రాజు ఆదివారం మద్యం తాగి తన తల్లి, మరదలు సునీత మరియు సమీప బంధువుల పిల్లలను కొట్టాడు. సోదరుడు శ్రీనివాస్ వచ్చి అడగగా అతనిపై కూడా ఇటుకతో దాడి చేసాడు. బాధితులు మధురానగర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు.