కార్వాన్ డివిజన్ లోని పనిపుర యూపిహెచ్సీని డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ స్వామి యాదవ్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి సౌకర్యాలపై అరా తీశారు. సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో మందుల కొరత లేకుండా చూసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.