ఖైరతాబాద్ జలమండలి ఆఫీసులో హెచ్ ఎమ్ డబ్ల్యు ఎస్ ఎస్ బి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన్నే నరసింహ పుట్టినరోజు వేడుకలు కార్మికుల, నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ రిజ్వాన్, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాణిక్ రెడ్డి, యూనియన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి, యూనియన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, అనిల్, తదితర నాయకులు పాల్గొన్నారు.