రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు

84చూసినవారు
రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు
నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి చైన్ స్నాచింగ్ చేసిన ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. టీచర్స్ కాలనీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కుంభం పద్మ అనే మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని దుండగులు టూ వీలర్ వాహనంపై వచ్చి రెండు తులాల బంగారు పుస్తెలతాడు అపహరించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :