
నేను తప్పు చేశా క్షమించండి: వైసీపీ ఎమ్మెల్యే
AP: కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి వివాదంలో చిక్కుకున్నారు. చిప్పగిరిలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో సీతమ్మ వారి మెడలో తాళి కట్టారు. దీనిపై కొందరు భక్తులు ఎమ్మెల్యేను విమర్శించారు. ఈ వివాదంపై ఎమ్మెల్యే విరూపాక్షి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. తాను కేవలం ఒక భక్తుడిలా మాత్రమే వెళ్లానని, అర్చకులు చెబితేనే తాళిబొట్టు కట్టానన్నారు. తాను చేసిన తప్పుకు క్షమించమని హిందువులను కోరారు.