మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు జన్మదినం సందర్భంగా అంబర్ పేట్ మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం నియోజకవర్గంలోని మున్సిపల్ కార్మికులకు చీరలు, బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. త్వరలో జరగనున్న బోనాల పండుగను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుందని తెలిపారు.