తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8,300 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్ షిప్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ శుక్రవారం డిమాండ్ చేశారు. మేడ్చల్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు ర్యాలీ, ధర్నా నిర్వహించిన అనంతరం మేడ్చల్ డిప్యూటీ ఎమ్మార్వో సునీల్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.