దోపిడి దొంగల బీభత్సం

6042చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం దోపిడి దొంగలు బీభత్సం సృష్టించిన సంఘటన చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం. లక్ష్మీగూడా రాజీవ్ గృహకల్ప ఫేస్ 2 లో నివాసం ఉంటున్న ఒక కుటుంబంలో ఎవరు లేని సమయంలో దోపిడి దొంగలు చొరబడి 14 తులాల బంగారాన్ని, కొంత నగదు అపహరించినట్లు తెలిపారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్