హైదరాబాద్: మోహన్‌బాబుపై కేసు నమోదు

70చూసినవారు
హైదరాబాద్: మోహన్‌బాబుపై కేసు నమోదు
రిపోర్టర్లపై దాడి చేసినందుకు నటుడు మోహన్‌బాబుపై పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఆయనపై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసిన రాచకొండ పోలీసులు ఇవాళ ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే తీవ్ర ఘర్షణ తర్వాత మోహన్‌బాబు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కావడం కష్టమేనని తెలిసింది.

సంబంధిత పోస్ట్