క్షణికావేశంలో కొడుకుపై తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాగా అతడు మృతి చెందిన ఘటన శనివారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కర్మన్ ఘాట్ న్యూ మారుతి నగర్ కి చెందిన వీరనగరి జైపాల్ డిగ్రీని మధ్యలో ఆపివేసి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ విషయంలో తండ్రి వీరనగరి శేఖర్ కుమారుడికి మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో తండ్రి కొడుకుపై కత్తితో దాడి చేశాడు.