నేను గాంధీలకు సర్వెంట్ కాదు: కేఎల్ శర్మ

69చూసినవారు
నేను గాంధీలకు సర్వెంట్ కాదు: కేఎల్ శర్మ
తనను గాంధీల కుటుంబానికి ప్యూన్‌గా బీజేపీ అభివర్ణించడంపై కాంగ్రెస్ అమేథీ అభ్యర్థి కేఎల్ శర్మ ఆదివారం స్పందించారు. తాను స్వచ్ఛమైన రాజకీయవేత్తనని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానంలో ఓడిపోతుందని చెప్పారు. బీజేపీ మీడియాను ప్రతిపక్షాలపై ఆయుధంగా వాడుతోందన్నారు. ఇప్పటికీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్