కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయకుండా ఉంటే, అప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 180 సీట్లు కూడా దాటవని పేర్కొన్నారు. 400 సీట్లు వస్తాయని బీజేపీ ఎలా చెబుతోందని, వాళ్లేమైనా జ్యోతిష్యం చెప్పేవాళ్లా అని ఆమె ప్రశ్నించారు. గతంలో ఎప్పుడైనా ఇలా చేసి ఉంటారేమో, అందుకే 400 సీట్లు వస్తాయని వాళ్లు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు.