తుఫాన్ వస్తే బంగారం దొరుకుతుంది. ఎక్కడో తెలుసా..?

53చూసినవారు
తుఫాన్ వస్తే బంగారం దొరుకుతుంది. ఎక్కడో తెలుసా..?
మనం తుఫాన్ వస్తుందంటే భయపడిపోతాం. కాని ఓ ప్రాంత ప్రజలు తుఫాన్ వస్తే వాళ్లు పండగ చేసుకుంటారు. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్రతీరానికి తుఫాన్లు తాకినప్పుడు, సముద్రపు లోతుల్లో నిక్షిప్తమైన పలు ఖనిజాలు, ముఖ్యంగా బంగారం రేణువులు, ఒడ్డుకు కొట్టుకు వస్తాయని స్థానికుల నమ్మకం. తుఫాను తర్వాత కెరటాలు వెనక్కి వెళ్లినప్పుడు, ఇసుకలో బంగారం రేణువులు ఉంటాయని భావిస్తూ పరుగులు తీస్తారు. ఈ క్రమంలో ఆ ఇసుకను జల్లెడ పట్టి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్