ఎన్నికల సందర్భంగా ఓటర్లను డబ్బుతో కొనడం, ఓటర్లకు డబ్బు, రకరకాల వస్తువులను పంపిణీ చేసి ప్రలోభపెట్టడం మనదేశంలో సర్వసాధారణంగా మారింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(1) ‘లంచగొండితనం’ గురించి వివరంగా ఉంది. అభ్యర్థి లేదా అతని తరఫున ఎవరైనా వ్యక్తి, ఇతరులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రలోభపెట్టేందుకు బహుమతి, ఉచిత కానుక, హామీ ఇవ్వడం లంచగొండితనం దీని కిందకు వస్తుందని ఈ సెక్షన్ చెబుతోంది.