ఈ డ్రింక్స్ తాగితే.. శరీరంలో టాక్సిన్స్ క్లీన్
మనం తినే రకరకాల ఆహారాలు, పలు అనారోగ్య సమస్యలకు ఉపయోగించే యాంటీబయోటిక్స్ వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. అయితే వాటిని తొలగించకపోతే బరువు పెరగటం, చర్మం నిర్జీవంగా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే లీటరు నీటిలో కీరదోస, పుదీనా, దాల్చిన చెక్క వేసి రాత్రంతా ఉంచి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. లేదా నీటిలో అల్లం ముక్క, నాలుగు తులసి ఆకులు, బత్తాయి ముక్కలు వేసి నాననివ్వాలి. 4-5 గంటల తర్వాత ఆ నీటిని తాగాలి.