గట్టిగా తుమ్మితే.. పేగులు బయటకొచ్చాయ్‌!

63చూసినవారు
గట్టిగా తుమ్మితే.. పేగులు బయటకొచ్చాయ్‌!
ఓ వ్యక్తి పెద్దగా తుమ్మడంతో అతని పేగులు బయటకు వచ్చాయి. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం ప్రకారం, 63 ఏండ్ల ఓ వ్యక్తి తన భార్యతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లగా..ఒక్కసారిగా పెద్ద పెట్టున తుమ్ము వచ్చింది. కొద్ది సేపటికి పొత్తి కడుపు భాగం రక్తంతో తడిసిపోయి నొప్పితో విలవిల్లాడాడు. అది గమనించిన అతడి భార్య తన భర్తను దవాఖానకు తరలించింది. వైద్యులు సర్జరీ చేసి అతడ్ని కాపాడారు. గతంలో అతడికి ఉదరభాగంలో సర్జరీ కావడంతో ఇలా జరిగిందని తేలింది.

సంబంధిత పోస్ట్