TG: 'భూ భారతి' పేరుతో తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ నిన్న అసహనానికి గురయ్యారు. ‘ఎవరు పడితే వాళ్లు ఒక యూట్యూబ్ ఛానెల్ పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే వాళ్లు జర్నలిస్టులు అవుతారా? వాళ్లు వాడే భాష చూస్తే రక్తం మరిగిపోతోంది. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నాం. కుటుంబసభ్యులను అంతేసి మాటలు అంటుంటే.. అసలు మీరు మనుషులేనా? మీకు భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు లేరా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.