జైలు పాలైన మంత్రి రాజీనామా

64చూసినవారు
జైలు పాలైన మంత్రి రాజీనామా
మనీలాండరింగ్ కేసులో జైలుపాలైన జార్ఖండ్ మంత్రి ఆలమ్‌గిర్ ఆలమ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాంచీలోని బిర్సాముండా సెంట్రల్ జైలు నుంచి సీఎం చంపై సోరెన్‌కు ఆయన లేఖ రాశారు. కేబినెట్ మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా జార్ఖండ్ సీఎల్పీ నేత పోస్టుకు రాజీనామా చేస్తున్నట్లు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు కూడా లేఖ రాశారు.

సంబంధిత పోస్ట్