మార్క్స్ తన జీవితకాల మిత్రుడు ఫ్రెడరిక్ ఏంగిల్స్ను 1844లో పారిస్‌లో మొదటిసారి కలిశాడు. భావ సారూప్యత కలిగిన వారిద్దరూ శాస్త్రీయ కమ్యూనిజం యొక్క సైద్దాంతిక సూత్రాలను ఆవిష్కరించటానికి, ఆ సూత్రాల ప్రకారంగా అంతర్జాతీయ కార్మికవర్గ ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో ‘కమ్యూనిస్టు లీగు’ ఏర్పాటు చేసి 1848లో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను రాశారు. 1867లో ‘దాస్ క్యాపిటల్’ మొదటి వాల్యూమ్‌ను ప్రచురించారు.