నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజలకు పెద్ద షాకిచ్చింది. దేశవ్యాప్తంగా టోల్ పన్నును పెంచింది. ఇవాళ్టి నుంచి అన్ని టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు 5 శాతం అదనంగా టోల్ ట్యాక్స్‌ను వసూలు చేస్తోంది. అయితే, ద్విచక్ర వాహన చోదకులకు టోల్ రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. ఏటా టోల్ రేట్లను పెంచడాన్ని ప్రతిపక్షాలు, పలువురు వాహనదారులు వ్యతిరేకిస్తున్నారు.