ఇండియా సిమెంట్స్ త్రైమాసిక నష్టం రూ.50 కోట్లు

79చూసినవారు
ఇండియా సిమెంట్స్ త్రైమాసిక నష్టం రూ.50 కోట్లు
ఇండియా సిమెంట్స్ జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.50.06 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.243.77 కోట్ల నష్టం నమోదైంది. ఆదాయం రూ.1,485.73 కోట్ల నుంచి రూ.1,266.65 కోట్లకు తగ్గింది. సిమెంటు విక్రయాలు 24.36 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి. స్థలాల విక్రయం ద్వారా రూ.24 కోట్ల లాభం వచ్చింది. సామర్థ్య వినియోగం 63 శాతానికి పెరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్