చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో ఉంది. 227 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీంఇండియా రెండోరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. దీంతో భారత జట్టుకి 308 ఆధిక్యం దక్కింది. రోహిత్(5), జైస్వాల్(10), విరాట్ కోహ్లి(17) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. గిల్(33), పంత్(12) క్రీజులో ఉన్నారు.