రైతుల నుంచి ఎంఎస్‌పిపై ధాన్యాల సేకరణను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఎఫ్‌సిఐని కుదించింది. సెంట్రల్ వేర్ హౌసింగ్‌ను డీమోనిటైజేషన్ పైప్‌లైన్‌లో పెట్టింది. ప్రజాపంపిణీ వ్యవస్థకు గండి కొడుతోంది. నూతన జాతీయ విద్యావిధానం పేరిట అంగన్‌వాడీ కేంద్రాల ప్రైవేటీకరణ, ఎత్తివేత, విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడిచి పిల్లల మధ్యాహ్న భోజనానికి మంగళం, ఇలాంటి ఎన్నో కుసంస్కరణలకు ఒడిగట్టింది. ధరల పెరుగుదల సరేసరి. వాటి ప్రభావమే ఆకలి సూచీలో భారత్‌కు చివరి స్థానాలను పదిలపర్చింది.