యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలతో ఇబ్బంది పడుతున్న ప్రపంచానికి భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన 'ది ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్'లో ప్రారంభోపన్యాసం చేశారు. ప్రస్తుతం 125 రోజుల తమ పాలనలో పేదలకు 3 కోట్ల పక్కాగృహాలు, యువతకు రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చామన్నారు. రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లను బదిలీ చేశామని, 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యానికి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.