భారత క్రికెట్ జట్టు ముంబై నుంచి శ్రీలంక పర్యటనకు బయలుదేరింది. తాజాగా భారత ఆటగాళ్లు శ్రీలంక చేరుకున్నారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్షదీప్ సింగ్ లంక గడ్డపై అడుగుపెట్టారు. కాగా, టీ20 జట్టు మాత్రమే శ్రీలంకకు బయలుదేరినట్టు కనిపిస్తోంది. ఈ టీ20 సిరీస్ జులై 27 నుంచి ప్రారంభమవుతుంది. అనంతరం ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరుగునున్నాయి.