1.1 లక్ష కోట్ల గంటలు ఫోన్ చూస్తూ గడిపిన భారతీయులు

2024లో భారతీయులు 1.1 లక్ష కోట్ల గంటలు ఫోన్ చూస్తూ గడిపారని ఈవై నివేదిక వెల్లడించింది. తక్కువ ఖర్చుతోనే అందుతున్న ఇంటర్నెట్ సేవలు అందుకు కారణమయ్యాయని తెలిపింది. ఇన్‌స్టా నుంచి నెట్‌ఫ్లిక్స్ వరకు డిజిటల్ వేదికల వినియోగం పెరిగిందని.. రోజుకు సరాసరి 5 గంటల పాటు మొబైల్ స్క్రీన్ ముందు గడుపుతున్నారని ఈ నివేదిక పేర్కొంది.