ఏపీలోని ప్రకాశం జిల్లా తాళ్లూరు నువ్వులకు అరుదైన గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో 140 దేశాల్లో అమ్ముకునేందుకు అవసరమైన ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్ ను పొందింది. ఇటీవల శివరామపురం గ్రామానికి చెందిన రైతులు 150 క్వింటాళ్ల నువ్వులను ఎక్స్‌పోర్ట్ చేయగా, పరీక్షల్లో మంచి ఉత్పత్తులుగా నిర్ధారణ అయింది. గత రబీలో ఎకరాకు రూ.12వేలు ఖర్చు పెట్టిన రైతులు మేలైన సాగు పద్ధతులతో రూ.40 వేల నుంచి 50వేల వరకు దిగుబడి సాధించారు.