ఇరాన్ అధ్యక్షుడు మృతి.. భారీగా పెరిగిన చమురు ధరలు

81చూసినవారు
ఇరాన్ అధ్యక్షుడు మృతి.. భారీగా పెరిగిన చమురు ధరలు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతితో ఆ దేశంలో రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో చమురు ధరలు పెరిగిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 84 డాలర్లకు చేరుకోగా, వెస్ట్ టెక్సాస్ ఇమీడియట్ బ్యారెల్ ధర 80 డాలర్లకు చేరింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా రాజు సల్మాన్ అస్వస్థతకు గురికావడం కూడా చమురు మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.