ఖాన్‌ యూనిస్‌పై ఇజ్రాయిల్‌ దాడి.. 89 మంది మృతి (వీడియో)

67చూసినవారు
దక్షిణ గాజాలోని తూర్పు ఖాన్‌ యూనిస్‌పై ఇజ్రాయిల్‌ మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో 89 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా అధికారిక మీడియా కార్యాలయం మంగళవారం తెలిపింది. వందలాది మంది గాయపడ్డారని పేర్కొంది. గాజాలోని పాలస్తీనా పౌర రక్షణ దళాలను ఖాళీ చేయాలని ఆదేశించిన కొద్ది నిమిషాలకే ఇజ్రాయిల్‌ వైమానిక దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ దాడికి ఇజ్రాయిల్‌ బాధ్యత వహించాల్సిందిగా యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ చీఫ్‌ ఫిలిప్పె లాజారియా పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్