మస్క్‌పై ఇస్రో ఛైర్మన్ ప్రశంసలు

61చూసినవారు
ఎలాన్‌మస్క్‌ వినూత్న ఆలోచనలను ఇస్రో ఛైర్మన్ ఎస్‌.సోమనాథ్‌ కొనియాడారు. ఇవాళ ఐఐటీ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మస్క్ కృషి వల్లే అంతరిక్షరంగం ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోందన్నారు. ‘‘స్పేస్‌ఎక్స్ ఇటీవల చాప్‌స్టిక్స్ తరహాలోని మెకానికల్ ఆర్మ్స్‌తో స్టార్‌షిప్‌ రాకెట్ బూస్టర్‌ను పట్టుకోగలిగింది. ఇస్రో ఎప్పుడు అలా చేస్తుందని అంతా అడుగుతున్నారు. మస్క్‌ ఈ సరికొత్త ఐడియాతో అందరినీ అబ్బురపరిచారు’’ అని సోమనాథ్‌ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్