న్నో పోషకాలను కలిగిన పెరుగు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. పొట్ట ఆరోగ్యానికి సహకరిస్తుంది. పెరుగులో ప్రొటీన్లు ఎక్కువగా, కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ కొద్ది పరిమాణంలో ఉంటాయి. శరీరంలో వివిధ అవయవాలు సవ్యంగా పనిచేయడానికి ఇవి దోహదపడతాయి. అయితే పెరుగును మధ్యాహ్న సమయం భోజనం తర్వాత తీసుకోవడం వల్ల అరుగుదల సాఫీగా జరిగిపోతుంది. ఇక రాత్రిళ్లు పెరుగు తినటం వల్ల పొట్టలో పలు సమస్యలకు కారణమవుతుంది.