టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లలో మూడు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో ఇండియా సంస్థల కార్యాలయాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. వచ్చిన సినిమాల ద్వారా వచ్చిన ఆదాయానికి, చెల్లించిన పన్నుకు వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. కాగా ఈ తనిఖీల్లో 55 టీమ్‌లు పాల్గొన్నాయి.