బీజేపీని విజయ శిఖరాలకు చేర్చడంలో వాజపేయి పాత్ర చాలా ముఖ్యమైనది. 1996లో కేంద్రంలో మొదటిసారిగా.. బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా పదవిలో ఉన్నారు. రెండవ సారి 1998 నుండి 1999 వరకు 13 నెలలు, 1999 నుండి 2004 వరకు పూర్తి కాలం ప్రధానిగా కొనసాగారు. వాజ్ పేయి అనగానే 1998లో పోఖ్రాన్ అణుపరీక్ష, 1999 కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం ప్రతి భారతీయుడి మదికి గుర్తుకొస్తాయి.