భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇకపై టీ20ల్లో జడ్డూ లేని మ్యాచులు చూడాలని బాధను వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు భారత్ తరుఫున 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 515 పరుగులు చేసి.. 54 వికెట్లు తీశాడు. తన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఎన్నో మ్యాచుల్లో జడేజా టీమిండియాకు అద్భుత విజయాలను అందించాడు.