రేపు అసెంబ్లీకి జగన్.. ప్లకార్డులు, బ్యానర్లు, ధర్నాలు నిషేధం!

3657చూసినవారు
రేపు అసెంబ్లీకి జగన్.. ప్లకార్డులు, బ్యానర్లు, ధర్నాలు నిషేధం!
AP: అసెంబ్లీ సమావేశాలకు సోమవారం జగన్ వెళ్లనున్నారు. నిబంధనల ప్రకారం సమయాన్ని కేటాయిస్తామని గతంలోనూ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. ఈ సమయాన్ని జగన్ వినియోగించుకుంటారా? లేక ఆందోళనలతో హడావుడి చేస్తారా అనేది కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో ప్లకార్డులు, బ్యానర్లు, ధర్నాలు, ప్రదర్శనలు నిషేదించారు. దీంతో ఏం జరుగుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.