మారేడుపల్లి పశు వైద్యాధికారిగా మనోజ్ కుమార్
ఎండపల్లి మండలం మారేడుపల్లి పశు వైద్య కేంద్రం వైద్య అధికారిగా బూర మనోజ్ కుమార్ సోమవారం అధికారిక బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు వెల్గటూరు మండలం పశు వైద్య కేంద్రం పరిధీలో గల ఎండపల్లి, అంబారిపేట పశు సంవర్ధక శాఖ ఉప కేంద్రాలు నేటితో మారేడుపల్లి పశు వైద్య కేంద్రం ఆధీనంలోకి రానున్నాయని మనోజ్ కుమార్ తెలిపారు. పశు సంవర్థక శాఖకు అధికారి రావడంతో ఎండపల్లి మండలానికి ఈ శాఖ నాలుగవ శాఖగా చరిత్రకెక్కింది.