సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆమెను ‘జయా అమితాబ్ బచ్చన్’ అంటూ పూర్తి పేరుతో సంబోధించడంపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. 'అమితాబ్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నా. నా భర్త సాధించిన విజయాలపై సంతోషంగా, గర్వంగానూ ఉంది. కానీ నన్ను కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే చాలు. మహిళలకు సొంత గౌరవం అంటూ లేేదా? ఇంతకు ముందు ఇలా జరిగేది కాదు’ అని ఆమె అన్నారు.