ఝాన్సీ తండ్రి రెండవ బాజీరావు పెష్వా దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవాడు. బాజీరావుకు సంతానం లేకపోవడంతో నానా సాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానా సాహెబ్, అతని పినతండ్రి కుమారుడు రావు సాహెబ్ మనూబాయిని తమ చెల్లెలిగా ఆదరించారు. వీరు ముగ్గురూ కలిసి కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటి విలు విద్యలన్నీ నేర్చుకున్నారు. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి గుర్రపు స్వారీ చేస్తూ నానా సాహెబ్ వెంట మనూబాయి దుసుకొని పోయేది.