ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల్లో తెలంగాణ హైకోర్టు నిర్మాణం కోసం జారీ చేసిన జీవో 55ను వెంటనే రద్దు చేయాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే,
బీజేపీ నేత రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. నిర్మాణానికి వర్సిటీ వీసీలు ఎలా సంతకం చేశారని ప్రశ్నించారు. కొత్త హైకోర్టు ఏర్పాటుకు
బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే దాన్ని మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు.