ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో వ్యాయామం చేయడానికి సమయం ఉండటం లేదు. దీంతో అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత అరగంట నడవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య, వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు బ్యాలెన్స్ అయి.. జీర్ణక్రియ మెరుగుపడుతుందని, అందువల్ల రక్తపోటు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుందని అంటున్నారు.