‘కల్కి 2898 ఏడీ’ మరో రికార్డు

62చూసినవారు
‘కల్కి 2898 ఏడీ’ మరో రికార్డు
గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం తాజాగా మరో సరికొత్త రికార్డు సృష్టించింది. ‘బుక్‌మైషో’లో అత్యధిక టికెట్లు అమ్ముడుబోయిన ఇండియన్‌ సినిమాగా నిలిచింది. 12.15 మిలియన్లకు పైగా ఈ మూవీ టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో, ఇప్పటివరకూ ఉన్న షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’ రికార్డును (12.01 మిలియన్‌ టికెట్లు) ‘కల్కి’ అధిగమించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you