బాన్సువాడ పట్టణంలోని గాంధీ చౌక్ లో గల గాంధీ విగ్రహానికి గాంధీ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీజీ ఆశయాలను మనమందరం నెరవేర్చి ఆయన అడుగుజాడల్లో నడవవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు షేక్ జుబేర్, నాయకులు మోచి గణేష్, సాకలి సాయిలు, శివ సూరి, తదితరులు పాల్గొన్నారు.