కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇండిపెండెన్స్ డే ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తాజా మాజీ సర్పంచ్ వెంకటరమణ మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నానమ్మ, తాత పేరుపై ప్రతి సంవత్సరం మెడల్స్ అందజేయనున్నట్లు ప్రకటించారు.