భార్య, ఆమె ప్రియుడిని చంపి కాసేపటికే ఆత్మహత్య చేసుకున్న భర్త
బెంగళూరులో తన భార్య 40 ఏళ్ల లక్ష్మీ పైతమ్మను, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న గణేశ్ అనే 20 ఏళ్ల వ్యక్తిని ఆమె భర్త గొల్లబాబు అర్ధరాత్రి కట్టెతో కొట్టి చంపాడు. అనంతరం తన మరదలికి ఫోన్ చేసి విషయం చెప్పి, కాసేపటికే తానూ ఉరేసుకుని చనిపోయాడు. మృతులది శ్రీకాకుళం జిల్లా అని, బెంగళూరులోని కోణనకుంటెలోని లేఅవుట్లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ ఇక్కడే నివాసముంటున్నారని పోలీసులు తెలిపారు.