జుక్కల్ మండలంలో గత 12 సం. లుగా వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహించిన నవీన్ కుమార్ నిజామాబాద్ జిల్లా నవీపేట్ కు బదిలీ అయ్యారు. ఆయన బదిలీ కావటంతో పెద్ద కొడప్గల్ వ్యవసాయ అధికారి కిషన్ కు శుక్రవారం ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. గత 12 సంవత్సరాలుగా జుక్కల్ మండల రైతులు, ప్రజలతో మమేకమై నిస్వార్ధంగా విధులు నిర్వహిస్తూ రైతులందరికీ అందుబాటులో ఉంటూ తమ వంతు సేవలు అందించారని కొనియాడారు.